ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 9:02 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక కానుక అందజేసిన గంగాధర సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి రాజన్న

ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక కానుక అందజేసిన గంగాధర సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి రాజన్న

చొప్పదండి. అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 5.

కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రానికి సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి రాజన్న ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని తన నిజాయితీని చాటుకున్నారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలోని ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందిస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గంగాధరకు చెందిన వేముల శంకరమ్మ- కీ.శే.రవీందర్ కుమార్తె సోని వివాహాన్ని పురస్కరించుకుని శుక్రవారం సోని వివాహానికి హాజరైన సర్పంచ్ దంపతులు రూ.10,116 నగదును పెళ్లి కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే తమ లక్ష్యమని, గ్రామ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. పేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిళ్లకు తమ వంతు అండగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల హామీని గుర్తుపెట్టుకుని మరీ సహాయం చేసిన సర్పంచ్ ఉదారతపై శంకరమ్మ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో చొప్పదండి ప్యాక్స్ చైర్మన్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి,గంగాధర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంత్రి మహేందర్,మహిళా కాంగ్రెస్  మండల అధ్యక్షురాలు చిరుత మంగ,ఉపసర్పంచ్ గాలిపెల్లి శ్రీనివాస్,వార్డ్ సభ్యులు గంట కిషన్,చిందం రాజు,కట్ల వసంత నారాయణ, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.